ఆంధ్రజ్యోతి-ఎబిన్ ఛానెల్ ప్రారంబించిన రోశయ్య
హైదరాబాద్, అక్టోబర్ 15 : ఆంధ్రజ్యోతి-ఎబిఎన్ ఛానెల్ గురువారం సాయంత్రం 4.48 గంటలకు ప్రారంభమయింది. ముఖ్యమంత్రి రోశయ్య ఛానెల్‌ను ప్రారంభించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఛానెల్ న్యూస్ నెటవర్క్‌ను ఆవిష్కరించారు. ఇంకా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసోం హైకోర్టు చీఫ్ జస్టీస్ చలమయ్య సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వక్తలంతా ఆంధ్రజ్యోతి ఛానెల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
'దమ్మున్న ఛానల్ మాది, దుమ్ము రేపే సైన్యం మాది'

హైదరాబాద్, అక్టోబర్ 15 : 'దమ్మున్న ఛానల్ మాది, దుమ్ము రేపే సైన్యం మాది' అని ఆంధ్రజ్యోతి-ఐబిఎన్ ఛానెల్ ప్రారంభోత్సవ సందర్భంగా ఎండి. రాధాకృష్ణ అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆంధ్రజ్యోతి-ఎబిఎన్ న్యూస్ నెట్‌వర్క్ ప్రారంభించిన తర్వాత టెస్ట్ సిగ్నల్ ప్రోమో ద్వారా రాధాకృష్ణ తన సందేశాన్ని వినిపించారు. నిజాన్ని నిర్భీతితో, నిజాయితీగా ప్రజల ముందుకు తీసుకువెళ్ళడానికి కృషి చేస్తామని ఈ ప్రోమోలో రాధాకృష్ణ చెప్పారు.