ఆంధ్రజ్యోతి-ఎబిన్ ఛానెల్‌కు ప్రముఖుల శుభాకాంక్షలు
హైదరాబాద్, అక్టోబర్ 15 : ఆంధ్రజ్యోతి-ఎబిఎన్ ఛానెల్ సిగ్నల్స్ కొద్ది సేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ ఛానెల్ ప్రారంభోత్సవం సందర్భంగా పలు రంగాల ప్రముఖులు ఆంధ్రజ్యోతి ఛానెల్ సక్సెస్ కావాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రసిద్ధ సినీ నిర్మాత, గిన్నిస్‌బుక్ రికార్డు నెలకొల్పిన రామానాయుడు, ఆయన తనయుడు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్‌బాబు, దిగ్దర్శకుడు, గిన్నిస్‌బుక్ రికార్డు గ్రహీత దాసరి నారాయణ రావు, నటీనటులు గుమ్మడి, సాయికుమార్, ఉదయ్‌కిరణ్, రాజా, రాజశేఖర్, జీవిత, శ్రియ, శ్వేతాబసుతో పాటు శ్రీనువైట్ల, కోటి, హరికృష్ణ, శ్రియ ఆంధ్రజ్యోతి-ఎబిఎన్ ఛానెల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సిఎం రోశయ్య, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పిసిసి చీఫ్ డిఎస్, చిరంజీవి, జయప్రకాష్ నారాయణ, బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, యాంకర్లు ఝాన్సీ, సుమ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. |
|
 |
 |
 |
 |
|